ఒక ఉద్యోగం ఎక్కువగా ఇచ్చినా..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా:కేటీఆర్

ఒక ఉద్యోగం ఎక్కువగా ఇచ్చినా..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా:కేటీఆర్

 రేవంత్ వచ్చాక  గాడిద గుడ్డు ఇచ్చిండు 
కేసీఆర్​ఇచ్చిన ఉద్యోగాలన్నీ సీఎం ఖాతాలోకే
బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ 

 
వరంగల్: పదేండ్లలో తెలంగాణ కంటే ఏ రాష్ట్రమైనా ఒక ఉద్యోగం ఎక్కువగా ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్​ వర్కింగ్​ కేటీఆర్ ప్రకటించారు. నర్సంపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యధికంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.  సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.  డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి  మోసం చేశారన్నారు. మోసపోతే గోస పడతామని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.  రెండోసారి మోసపోవద్దని హెచ్చరించారు.  అసెంబ్లీ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు.  

కరెంటు పోవడం, ఎరువుల దొరకకపోవడం, రైతుబంధు మేలో వేయడం ఇదే కాంగ్రెస్​ పాలనలో మార్పు అని ఎద్దేవా చేశారు.  చేసిన వాటిని చెప్పుకోలేక ఓడిపోయా మన్నారు.  రేవంత్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వకుండ గాడిద గుడ్డు ఇచ్చిండని సెటైర్​ వేశారు. నోటిఫికేషన్​లేకుండానే 35 వేల  ఉద్యోగాలు ఇచ్చామంటే నమ్ముదామా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు.   గ్రాడ్యుయేట్స్​ ఆలోచించి  రాకేశ్​ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఫోటోలు మార్ఫింగ్ చేసి తీన్మార్ మల్లన్న డబ్బులు సంపాదించాడని,ఆయనపై 56 కేసులు ఉన్నాయన్నారు. ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగేవారికి చాన్స్ ఇవ్వాలని కోరారు.