హైదరాబాద్/అల్వాల్, వెలుగు: భార్య మృతితో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కేటీఆర్, సత్యం భార్య రూపాదేవి ఫొటోకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
సత్యంను ఓదర్చారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.