అరాచకాలను రాసిపెట్టుకుంటాం

అరాచకాలను రాసిపెట్టుకుంటాం
  • కౌశిక్​ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటిపై అరికెపూడి గాంధీతో దాడి చేయించిందన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధత్య వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు.  

అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని ప్రయత్నిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వమే దాడి చేయించటమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా రాసి పెట్టుకుంటామని హెచ్చరించారు.