ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు : కేటీఆర్​

ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు : కేటీఆర్​
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పాలనలో ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్  చెప్పిందని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతామంటూ ప్రగల్భాలు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు.

 తీరా ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని శనివారం ఎక్స్​లో ఆయన మండిపడ్డారు. నెలకు సగటున రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చామని కాంగ్రెస్​ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకున్నదని తెలిపారు. అయినా కూడా రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, రైతు బీమా ప్రీమియం కట్టలేదన్నారు. కనీసం పంటలనూ కొంటలేదని విమర్శించారు.