సీఎం రేవంత్కు ప్రతిసవాల్ విసిరిన కేటీఆర్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి  ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయి అని ఘాటుగా విమర్శించారు. ఆడబిడ్డలకు రూ. 2,500 ఇవ్వు.. ఇచ్చిన 420 హామీలను అమలు చెయ్యి.. ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవొద్దా.. ఇవేం మాటలు అని అసహనం వ్యక్తం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ పిరియారిటి కాంప్లెక్స్ ఉంది.. కొడంగల్, జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసి సవాల్ విసిరి పారిపోయిండు.. ఆయన మాటకు ఏం విలువ ఉంది అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి.. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేద్దాం.. అంటూ ప్రతి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. 

ALSO READ :- తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం: ఎంపీ లక్ష్మణ్

రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. నాది మేనేజ్ మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకలది ఏం కోటా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ది పేమెంట్ కోటా .. మాణిక్కం ఠాకూర్ కు డబ్బులిచ్చి తెచ్చుకున్న పేమెంట్ కోటా కాదా అని కేటీఆర్ అన్నారు.