నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ శనివారం మహిళా కమిషన్ ఎదుట ఎంక్వైరీకి హాజరు కానున్నారు. బస్సుల్లో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండంటూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్ ఆయనకు ఈ నెల16న నోటీసులు ఇచ్చింది. కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ.. కమిషన్ ఎదుట తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. 

తాను యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దాడుల వివరాలను.. మహిళలపై సీఎం రేవంత్‌‌, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా కమిషన్‌‌కు అందజేస్తానన్నారు.