తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నయ్ : కేటీఆర్

 తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతిన్నయ్ : కేటీఆర్
  • ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కూడా చెప్పిండు 
  • తక్షణమే ప్రభుత్వం హోంమంత్రిని నియమించాలి
  • పోలీస్​ ఆఫీసర్లకు ఫ్రీడమ్​ ఇవ్వండి
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

అంబర్ పేట, వెలుగు : తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే హోంమంత్రిని నియమించాలని బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్​చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌‌‌‌‌‌‌‌ద్రత‌‌‌‌‌‌‌‌లు స‌‌‌‌‌‌‌‌రిగ్గా లేవ‌‌‌‌‌‌‌‌ని జగిత్యాలలో కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇటీవల అంబ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌పేట సాయిబాబాన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో దారుణ హ‌‌‌‌‌‌‌‌త్యకు గురైన వృద్ధ దంప‌‌‌‌‌‌‌‌తులు లింగారెడ్డి, ఊర్మిళదేవి కుటుంబ స‌‌‌‌‌‌‌‌భ్యుల‌‌‌‌‌‌‌‌ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంక‌‌‌‌‌‌‌‌టేశ్‌‌‌‌‌‌‌‌తో క‌‌‌‌‌‌‌‌లిసి కేటీఆర్ ప‌‌‌‌‌‌‌‌రామ‌‌‌‌‌‌‌‌ర్శించారు.

‘‘సీనియ‌‌‌‌‌‌‌‌ర్ సిటిజన్స్ లింగారెడ్డి, ఊర్మిళ‌‌‌‌‌‌‌‌దేవిని ప‌‌‌‌‌‌‌‌ట్టప‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌లు దుండగులు అతి కిరాతకంగా చంప‌‌‌‌‌‌‌‌డం దారుణ‌‌‌‌‌‌‌‌ం. వృద్ధ దంపతుల హత్య అందరినీ క‌‌‌‌‌‌‌‌లిచివేసింది. హత్య చేసి  రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు కేసును ఛేదించలేకపోయారు. సిటీతోపాటు రాష్ట్రంలో శాంతిభ‌‌‌‌‌‌‌‌ద్రత‌‌‌‌‌‌‌‌లు స‌‌‌‌‌‌‌‌రిగ్గా లేవు. ఇదే విషయాన్ని కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చేప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి చెబుతున్నాం. వెంటనే హోంమంత్రిని నియమించండి. పోలీసులని ఉసిగొల్పి అశోక్ నగర్‌‌‌‌‌‌‌‌లో పిల్లలు మీద దాడులు చేయించ‌‌‌‌‌‌‌‌డం, కేసు పెట్టించడం కాదు. శాంతిభద్రతలను కాపాడాలి.

రాష్ట్రంలో సమర్థమైన పోలీస్ అధికారులు చాలా మంది ఉన్నారు. వారికి ఫ్రీడమ్ ఇవ్వండి. పని చేయనివ్వండి. ఎవ‌‌‌‌‌‌‌‌రో వస్తారు.. ఏదో చేస్తారని వేచి చూడొద్దు. మా ప్రభుత్వంలో సిటీ వ్యాప్తంగా10 లక్షలు సీసీ కెమెరాలు పెట్టాం. పాడైన సీసీ కెమెరాలను బాగుచేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మా సొంత ఖర్చుతో  బాగు చేయిస్తాం” అని కేటీఆర్​చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.