రామగుండం  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుమ్ములాట ​.. రెండు వర్గాలుగా విడిపోయిన కార్పొరేటర్లు 

  • నేడు గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంపునకు తరలేందుకు ఏర్పాట్లు 
  • ఆ తర్వాత బీఆర్ఎస్​ హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసే యోచనలో కార్పొరేటర్లు
  • మేయర్, పార్టీ జిల్లా అధ్యక్షుడిపై కార్పొరేటర్ల కినుక 

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయాక  బీఆర్ఎస్  పార్టీలో కుమ్ములాటలు తప్పడం లేదు. ఈక్రమంలో రామగుండం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కన్ఫ్యూజన్​ నెలకొంది. బల్దియాలో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవిశ్వాసం పెడతామంటూ కొందరు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు రహస్య మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించారు.  రెండు వర్గాలగా విడిపోయి క్యాంపులకు వెళ్లేందుకు కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. ఇందులో ఓ వర్గం నేడు గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంపుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తమను పట్టించుకోకపోతే పార్టీ మారుతామని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంకేతాలు పంపుతున్నారు. కాగా వీరంతా అవిశ్వాస లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వకుండానే  బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా ఉండే మరికొందరు ఇదంతా ఉత్తదేనని కొట్టిపారేస్తున్నారు. పదవీకాలం మరో ఏడాదే ఉండగా ఎంతో కొంత లబ్ధి పొందాలన్న ఆలోచనలో కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గమనిస్తున్నారు. 

క్యాంపుల నిర్వహణకు ప్లాన్​

రామగుండం బల్దియాలో 50 మంది కార్పొరేటర్లలో 33 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినవారే.  నాలుగేండ్ల కింద 30వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అనిల్​కుమార్​మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక టైంలో ఇచ్చిన కమిట్​మెంట్‌‌‌‌ పూర్తిచేయలేదని, ఇప్పటికైనా పూర్తిచేయాలని కొందరు కార్పొరేటర్లు మేయర్​పై ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, స్థానికంగానూ బీఆర్ఎస్​క్యాండిడేట్​ఓడిపోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.

తన పదవి పోయినా ఫర్వాలేదని, డబ్బు మాత్రం ఇచ్చేది లేదన్న ధోరణిలో మేయర్​ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి కార్పొరేటర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవిశ్వాసం పెడితే మరొకరిని ఎన్నుకోవచ్చని, అలా తమకు రావాల్సిన డబ్బును కొత్త మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నుంచి తీసుకోవచ్చనే ఆలోచనలో అసంతృప్త కార్పొరేటర్లు ఉన్నారు. ఈక్రమంలో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే క్యాంపు రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వరుస పండుగలు రావడం, పలువురు అందుబాటులో లేకపోవడంతో దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

మరోవైపు అసంతృప్తి కార్పొరేటర్లకు నాయకుడు ఎవరు లేకపోయినా వారిలోనే కొందరు క్యాంపు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని ఓ రిసార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించినట్లు తెలుస్తోంది. నేడు సుమారు 16 మంది కార్పొరేటర్లు అక్కడికి తరలివెళ్లేందుకు ప్లాన్​ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునే చాన్స్​ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 

జిల్లా నాయకత్వంపై ధిక్కారం 

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తమ పరిధిలో పెద్దఎత్తున ప్రజలను సమీకరించారు. ఎన్నికల  ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకు కోసం పలువురు కార్పొరేటర్లు భారీగా ఖర్చు పెట్టారు. కాగా  పెట్టిన ఖర్చును ఇస్తానన్న మాజీ ఎమ్మెల్యే ఆ తర్వాత పట్టించుకోకపోవడం కూడా కార్పొరేటర్లలో అసంతృప్తికి కారణమైనట్లు ప్రచారం నడుస్తోంది. ఓ వైపు మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరో వైపు మాజీ ఎమ్మెల్యే తమకిచ్చిన కమిట్​మెంట్లను నెరవేర్చకపోవడంతోపాటు మోసం చేశారన్న భావనలో ఉన్నారు.

ఈక్రమంలో పలువురు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు.. అవకాశమొచ్చిన ప్రతిసారీ తమ ధిక్కారాన్ని బహిరంగపరుస్తున్నారు.  ఈక్రమంలోనే రామగుండం బల్దియాలో అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనకు వచ్చి సంతకాలు కూడా సేకరించారు. ఈక్రమంలో మరికొందరి మద్దతు కూడగట్టి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవిశ్వాస లెటర్​ఇవ్వాలని అసంతృప్త కార్పొరేటర్లు భావిస్తున్నారు. కాగా తాము అనుకున్నది నెరవేరకపోతే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీడేందుకు కూడా రెడీ అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.