సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి

సీఎం రేవంత్‌రెడ్డి  బహిరంగ   క్షమాపణలు చెప్పాలి
  • క్షమాపణలు చెప్పాలి
  • బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ 

ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓయూ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. శుక్రవారం బీఆర్ఎస్వీ విద్యార్థులతో ఇఫ్లు చౌరస్తా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  మాజీ సీఎం కేసీఆర్‌‌ను మార్చురీకి పంపిస్తామన్న రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌‌పైన బీఆర్‌‌ఎస్ పార్టీపైన అడ్డగోలుగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కిరణ్ గౌడ్, వేల్పుల వెంకట్, దశరథ్,  జంగయ్య, రమేశ్ గౌడ్, ప్రశాంత్, నరేశ్, శ్రీను నాయక్, రామకృష్ణ , శ్రీమాన్, నాగేంద్ర నాగరాజు, అవినాష్,  శ్రీకాంత్, రాహుల్, సాయి విశాల్, కిరణ్, రహమత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.