
హైదరాబాద్: బోరబండ పీఎస్పరిధిలో అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. శివాజీనగర్ కు చెందిన భాను అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపారు. హత్య చేసి నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
పాతకక్షల కారణంగానే భాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు భానుపై గతంలో పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. డెడ్‌బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.