
హైదరాబాద్ లో దారుణం జరిగింది.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఆదివారం ( ఏప్రిల్ 20 ) ఉదయం చోటు చేసుకుంది ఈ దారుణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తి 24 ఏళ్ళ మనోజ్ గుర్తించారు పోలీసులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలేమైనా హత్యకు దారి తీశాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.