పెదనాన్నను చంపి.. సెల్ఫీ దిగిన కొడుకు

సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండాల్సిన కుటుంబసభ్యులే ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు.

ఆదిలాబాద్‌లో దారుణం జరిగింది. జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగన్నపేటలో ఏఎస్‌ఐగా పనిచేసి రిటైర్ అయిన తాళ్లపల్లి శివరాజ్ కు.. అతడి తమ్ముడు జయరాజ్ కు మధ్య ఆస్తి తగాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జయరాజ్ కుమారుడు తన పెదనాన్నను హత మార్చాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం చర్చీకి వెళుతుండగా హత్య చేశాడు.  అ పై మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు నిందితుడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హత్యపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.