
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడాన్ కార్స్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. టోర్నమెంట్ నుండి కార్సేను తప్పిస్తూ ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అధికార ప్రకటన చేసింది. "డర్హామ్, ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడాన్ కార్స్ ఎడమ కాలి బొటనవేలు గాయం కారణంగా ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు." అని ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం(ఫిబ్రవరి 22) లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్‌లో కార్స్ గాయపడ్డాడు. కాలి గాయం కారణంగా సోమవారం ఈ ఇంగ్లాండ్ పేసర్ శిక్షణా సెషన్‌కు కార్స్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో 9.85 ఎకానమీ రేటుతో భారీగా పరుగులు సమ్పర్పించుకున్నాడు. కార్సే దూరమవడంతో అతని స్థానంలో జేమీ ఓవర్టన్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ లో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.
కార్స్ స్థానంలో స్పిన్నర్ ఇంగ్లాండ్ స్క్వాడ్ లోకి రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. కార్సేకు ప్రత్యామ్నాయంగా వచ్చిన రెహాన్.. భారత వైట్-బాల్ పర్యటనలో ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. రెహన్ జట్టులోకి చేరడంతో ఇంగ్లాండ్ స్పిన్ బలంగా మారనుంది. ఈ 20 ఏళ్ల ఇంగ్లాండ్ స్పిన్నర్ ఇంగ్లాండ్ తరపున ఐదు వన్డే మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు. ఏకైక స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఏకైక ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ స్క్వాడ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్.
#OrangeArmy wishes you a speedy recovery, we can’t wait to see you don the 🟠⚫️#SunrisersHyderabad #BrydonCarse pic.twitter.com/LbGaFdC7d7
— Orange Army (@srhfans0fficial) February 24, 2025