శనివారం (జనవరి 25) చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ ను గెలిపించాడు. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయినా ఆ జట్టులో ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ అద్భుతంగా రాణించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఇంగ్లాండ్ ను చివరి వరకు గేమ్ లో ఉంచాడు. కార్స్ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ యాజమాన్యం ఫుల్ హ్యాపీగా ఉంది.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో బ్రైడన్ కార్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. కోటి రూపాయలకు దక్కించుకుంది. పెద్దగా పరిచయం లేని ఈ ఇంగ్లాండ్ బౌలర్ ను కోటి రూపాయలకు దక్కించుకోవడం అప్పట్లో కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కార్స్ మాత్రం బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. మొదట బ్యాటింగ్ లో 17 బంతుల్లోనే 3 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 31 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రథమమైన స్కోర్ అందించాడు.
బౌలింగ్ లో 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. వీటిలో సూర్య కుమార్ యాదవ్ వికెట్ ఉండడం విశేషం. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు కమ్మిన్స్ షమీలతో పటిష్టంగా కనిపిస్తుంది. వీరికి కార్స్ తోడైతే హైదరాబాద్ జట్టుకు తిరుగుండదు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తొలి టీ20 మ్యాచ్ లో భారీగా పరుగులిచ్చిన అట్కిన్సన్ స్థానంలో కార్స్ రెండో టీ20లో ఆడాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. అనంతరం తిలక్ మెరుపులతో ఇండియా 19.2 ఓవర్లలో 166/8 స్కోరు చేసి గెలిచింది.
Brydon Carse with bat 31 (17)
— Dinda Academy (@academy_dinda) January 25, 2025
Brydon Carse with ball 3 wickets
Another Kavya Maran masterclass at the auction table 🥵 pic.twitter.com/yn0WTgldCI