చెన్నై వేదికగా భారత్ తో శనివారం (జనవరి 25) జరగబోయే రెండో టీ20కి ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ లో బట్లర్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రైడాన్ కార్స్‌కి తుది జట్టులో చోటు దక్కింది. ఇంగ్లాండ్ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్ కు జట్టులో స్థానం పోవడానికి టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి టీ20లో ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ కు సంజు శాంసన్ పీడకలనే మిగిల్చాడు. అతను వేసిన తొలి ఓవర్ లో ఏకంగా 22 పరుగులు బాదాడు.
అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో శాంసన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో రెండే ఓవర్లు వేసిన అట్కిన్సన్.. ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన రెండో ఓవర్ లో మరో 16 పరుగులు వచ్చాయి. బ్రైడాన్ కార్స్ కూడా ఫాస్ట్ బౌలర్ కావడం విశేషం. తొలి టీ20 లో మాదిరిగానే ఇంగ్లాండ్ నేడు జరనున్న రెండో టీ20కి నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ జట్టులో కొనసాగనున్నాడు.
ALSO READ | IND vs ENG, 2nd T20I: మ్యాచ్ విన్నర్‌కు గాయం.. చెన్నై టీ20కి రెండు మార్పులతో టీమిండియా
తొలి పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరోసారి ఓడితే సిరీస్‌లో పుంజుకోవడం కష్టమైన నేపథ్యంలో చెపాక్‌లో ఆ జట్టు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. స్పిన్ వికెట్‌పై సీనియర్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ సత్తా చాటాలని కోరుకుంటోంది. అదే సమయంలో బ్యాటింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ నుంచి మంచి ఆరంభం అవసరం.
🚨 Team news for tomorrow's second T20I v India
— England Cricket (@englandcricket) January 24, 2025
🔁 Brydon Carse comes in for Gus Atkinson
🆕 Jamie Smith has also been added to the 12 player squad pic.twitter.com/Fr4Hju00qs