- గో బ్యాక్ బాల్క సుమన్ అంటూ రైతుల నినాదాలు
- రైతులను అడ్డుకున్న పోలీసులు
జైపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. ఆదివారం (నవంబర్26) ఎన్నికల ప్రచారంలో భాగంగాల చెన్నూరు నియోజవర్గంలోని కిష్టాపూర్ గ్రామానికి వెళ్తుండగా..ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. గ్రామంలో రావొద్దంటూ..ఊరిబటయ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ తూతూ మంత్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి వెళ్లి పోయాడు బాల్కసుమన్.
ఈ సందర్భంగా రైతులు లంబు సత్యనారాయణ రెడ్డి, మాయ శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో గ్రామంలోని 4వందల ఎకరాలు పంట పొలాు నీటి మునిగిపోతుంటే.. రైతుల బాగోగులు బాల్క సుమన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కూడా నష్ట పరిహారం చెల్లంచలేదని.. ఎన్నికల రాగానే ఓట్లు అడిగేందుకు మా ఊరికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు.
కిష్టాపూర్ శివారులోని సర్వే నెంబర్ 50లో ఏళ్ల తరబడి భూ సమస్యలను ఎన్నిసార్లు ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతు బంధు, కొంత మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా కూడా రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాపిరెడ్డి, మహిపాల్ రెడ్డి, రమణారెడ్డి, రాయమల్లు, రాజయ్య, మరికొంతమంది రైతులు పాల్గొన్నారు.