జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బీఎస్ లత నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ రాంబాబు సూర్యాపేట జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న బీఎస్ లతను ఇక్కడికి బదిలీ చేశారు.
ఈమె గతంలోనూ జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే కోరుట్ల ఆర్డీవోగా జివాకర్‌రెడ్డిని నియమించారు. ప్రస్తుత ఆర్డీవో ఆనంద్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.
సిరిసిల్ల ఆర్డీవో బదిలీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల ఆర్డీవో రమేశ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిరిసిల్లకు వెంకట ఉపేందర్ రెడ్డి వచ్చారు.