భద్రాచలం, వెలుగు : వినియోగదారుల కోరిక మేరకు కొత్త ఫీచర్లతో రూపొందించిన బీఎస్ 4 గ్లామర్ తొలి బైక్‌ను హీరో కంపెనీ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి ఇచ్చింది. శ్రీరామ్ హీరో షోరూం నిర్వాహకులు భరత్, హీరో డిప్యూటీ జోనల్ మేనేజర్ లక్ష్మిషా, తెలంగాణ ఏరియా మేనేజర్ మనీష్‌జైన్, తెలంగాణ హెడ్ వినీత్, టీఎస్ మేనేజర్ కరణ్‌తో కలిసి ఆయన ఆలయంలో బైక్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రలో తిరుమల వేంకటేశ్వరునికి, తెలంగాణలో భద్రాద్రి రామయ్యకు వీటిని ఇస్తున్నట్లు తెలిపారు. షోరూం ధర రూ.81200లు ఉంటుందనిz, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.