బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ ఆత్మహత్య

వరంగల్ జిల్లా హసన్ పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి సూసైడ్ చేసుకుంది.   క్యాంపస్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మంచిర్యాల జిల్లాకు చెందిన దీప్తి రాథోడ్ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండియర్ చదువుతుంది. 

 దీప్తి  ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఎంజీఎం హాస్పటిల్ మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు.