- చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మందుపాతర పేలడంతో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం జిల్లాలోని కోయిలీబేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పానీడిబోర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన బీఎస్‌ఎఫ్ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హెంటార్కేసా గ్రామం వద్ద అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను బాంబు స్క్వాడ్ గుర్తించింది.
దాన్ని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలడంతో ఈశ్వర్‌రావు అనే బీఎస్‌ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. అతడిని హెలీకాప్టర్‌లో రాయ్‌పూర్ హాస్పిటల్‌కు తరలించారు.