భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్మగ్లర్లపై కాల్పులు జరిపి తరిమికొట్టారు. 47 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ గురుదాస్ పూర్లోని చందూ వదాలా పోస్ట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున సరిహద్దు దగ్గర స్మగ్లర్ల కదలికలు గమనించిన జవాన్లు.. వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. స్మగ్లర్లు చేసిన ఎదురుకాల్పుల్లో భారత జవాన్‌కు గాయమైంది. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్‌తోపాటు.. 7 కేజీల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా.. ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Punjab | BSF in an encounter with Pakistani smugglers seized 47 yellow packets suspected to be heroin, along with arms and ammunition including 4 magazines of AK 47 from Chandu Wadala post in Gurdaspur earlier today. One jawan also got injured in the firing and is stable now: BSF pic.twitter.com/hCP7yRTZYh
— ANI (@ANI) January 28, 2022