జియో, ఎయిర్‌టెల్, VI టెలికాం కంపెనీలు రీఛార్జీ ప్లాన్ల ధరలు భారీగా పెంచాయి. నెల రోజుల క్రితం 15 శాతం మొబైల్ టారిఫ్ ధరలు పెంచుతూ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్ సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో మొబైల్ యూజర్ల చూపు గవర్నమెంట్ నెట్ వర్క్ BSNLవైపు మళ్లింది. BSNL తక్కువ ధరకే బెస్ట్ ఆఫర్లతో ముందుకు వచ్చింది.
గత 23 రోజుల్లోనే లక్ష BSNL సిమ్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ పరిధిలో యాక్టివేషన్ అయ్యాయి. కొంతమంది కొత్త నెట్ వర్క్ కనెక్షన్ తీసుకుంటున్నారు. మరికొందరు జియో, ఎయిర్ టెల్, వీఐల నుంచి BSNLకు మారారు. ఎందుకంటే ఇతర కంపెనీల కంటే BSNL తక్కువ రీఛార్జీలకే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.
— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) July 27, 2024
BSNL ఈ ఏడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 4G సర్వీస్ ప్రారంభించింది. దాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానుంది. 23 రోజుల్లోనే BSNLకు లక్ష మంది యూజర్లు యాక్టివేట్ చేసుకున్నారని జూలై 27న BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ X హ్యాండిల్‌లో ప్రకటించింది. వీరు నేరుగా యాక్టివేట్ చేసుకున్నారా? లేక అదే నెంబర్ తో పోర్టబిలిటీ ద్వారా BSNL కు వచ్చారా అని కంపెనీ తెలపలేదు. ఇప్పుడు మీరు వాడుతున్న నెంబర్ మీదనే BSNL కి మారొచ్చు. అదెలాగో చూద్దాం..
BSNL పోర్టబిలిటీ ప్రక్రియ :
-
sep 1: పోర్ట్ ఫార్మాట్ కోసం 1900కి మేసేజ్ పంపాలి.PORTపది అంకెల మీ ఫొన్ నెంబర్ ని1900కి మెసేజ్ చేయాలి. BSNLకి మారడానికి పోర్ట్ మెసేజ్ పంపిన తర్వాత15 రోజుల టైం పడుతుంది.
sep 2: మొబైల్ నంబర్ పోర్టింగ్‌ను అభ్యర్థించడానికి BSNL CSC (కస్టమర్ సర్వీస్ సెంటర్) రిటైలర్‌ను, BSNL ఆఫీస్ కు వెళ్లాలి.
sep 3: కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF)ని పూర్తి చేయాలి.
sep 4: అప్పుడు మీకు కొత్త BSNL SIM కార్డ్ వస్తుంది. మీ పోర్టింగ్ రిక్వెస్ట్ ఆమోదించబడిన తర్వాత, ఏ రోజు మీ సిమ్ యాక్టివేట్ అవుతుందో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పటి నుంచి మీరు BSNL నెట్ వర్క్ కు మారినట్లు.
ఏవైనా సమస్యలు ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1503 లేదా 1503కి కాల్ చేయండి. ఈ విషయాన్ని షేర్ మీ మిత్రులకు షేర్ చేయండి.