హైదరాబాద్, వెలుగు: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అగ్రిగేటర్ ఓటీటీ ప్లేతో కలిసి టెలికం ఆపరేటర్బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ టీవీ సర్వీస్బీఎస్ఎన్ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సేవ మనదేశం అంతటా బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఎన్నో ప్రీమియం ఛానెల్స్సహా 450లకు పైగా ఎక్కువ లైవ్ టీవీ చానెల్స్ చూడవచ్చు. పుదుచ్చేరిలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా నిర్వహించారు.
బీఎస్ఎన్ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంపెనీ కస్టమర్లు భక్తిఫ్లిక్స్, షార్ట్‌ఫండ్లీ, కాంచా లంక, స్టేజ్, ఓఎమ్ టీవీ, ప్లేఫ్లిక్స్, ఫ్యాన్‌కోడ్, డిస్ట్రో, హబ్‌హాపర్, రన్ టీవీ వంటి ఓటీటీలను చూడవచ్చు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ ఏ ప్లాన్‌లో ఉన్నా బీఐ టీవీని చూడొచ్చు. ఓటీటీ ప్లే సీఈఓ అవినాష్ ముదళియార్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ప్రీమియం కంటెంట్ను ఉచితంగా చూడటం సాధ్యపడుతుందని చెప్పారు.