దేశంలోని ప్రముక టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి సంస్థలు టారిఫ్ ప్లాన్ను భారీగా పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. రీఛార్జ్ ప్లాన్‌లను సగటున 15 శాతం పెంచి యూజర్లపై భారం మోపాయి. దీంతో చాలా మంది కస్టమర్లు తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్లు అందిస్తో్న్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. జియో, ఎయిర్ టెల్, వీఐ టారిఫ్ ప్లాన్ రేట్లు పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్లోకి పెద్ద ఎత్తున కొత్త కస్టమర్లు వచ్చి చేరుతున్నారు.
4జీ సేవలను సైతం బీఎస్ఎన్ఎల్ స్పీడప్ చేయడంతో మరింత మంది యూజర్లు ఈ కంపెనీలోకి మారుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కస్టమర్లను మరింత ఆకర్శించేందుకు సరసమైన ధరలకే బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా బీఎస్ఎన్ఎల్ మరో రెండు కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4G డేటా వంటి అనేక ప్రయోజనాలతో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను రూపొందించింది.
రూ.108 రీఛార్జ్ ప్లాన్ వివరాలు:
* నేషనల్ రోమింగ్
* అపరిమిత వాయిస్ కాలింగ్
* 28 రోజుల పాటు 1GB హై-స్పీడ్ డేటా
* ఉచిత ఎస్ఎంఎస్ అందుబాటులో లేదు.
రూ. 249 రీఛార్జ్ ప్లాన్ వివరాలు:
* నేషనల్ రోమింగ్
* అపరిమిత వాయిస్ కాలింగ్
* 45 రోజుల పాటు 2GB హై-స్పీడ్ డేటా
* రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు