ప్రైవేట్ నెట్‌వర్క్‌లు రీఛార్జ్ ప్లాన్స్ పెంచే సరికి అందరూ బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లారు. BSNL నెట్ వర్క్ కస్టమర్లు కూడా భాగా పెరుగుతున్నారు. కానీ సర్వీస్ అందించే విషయంలో మాత్రం ఈ కంపెనీ వెనుకబడి ఉంది. ఈ క్రమంలో గవర్నమెంట్ కంపెనీ అయిన BSNL అధికారులు సోమవారం పార్లమెంటరీ కమిటీతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే BSNL 24వేల 4బీ మొబైల్ టవర్లు ఉండగా.. వాటిని లక్షకు పెంచే ప్లాన్ లో ఉంది. నెట్ వర్క్ విషయంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారని పార్లమెంట్ కమిటీ అధికారులపై ఫైర్ అయ్యింది. వచ్చే ఆరు నెలల్లో మెరుగైన సేవలను అందిస్తామని అధికారులు ప్యానెల్‌కు హామీ ఇచ్చారు. అధికారులు ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా స్వదేశీ సాంకేతికతపై కంపెనీ ఆధారపడటాన్ని హైలైట్ చేశారు.
టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చర్చలు ప్రధానంగా సంస్థ పనితీరుపై, ముఖ్యంగా దాని 4G, 5G సేవలకు పైన జరిగాయి. మొబైల్ కనెక్షన్‌లకు ప్రైవేట్ ఆపరేటర్ల ఆఫర్ల కారణంగా BSNL మార్కెట్ వాటా దాదాపు ఏడు శాతానికి పడిపోయిందని కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 54 వేల టవర్లు 4జీ టెక్నాలజీతో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, మరిన్ని పనులు జరుగుతున్నాయని అధికారులు కమిటీకి తెలియజేశారు. ఆరు నెలల్లో లక్ష టవర్ల లక్ష్యాన్ని చేరుకొని.. BSNL సర్వీస్ డెవలప్ చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతేకాదు బీఎస్ఎన్ఎల్ 4G నుంచి 5Gకి మారడం సాంకేతికంగా సాధ్యమేనని వారు తెలిపారు. TRAI అనుమానాస్పద కాల్‌లు, నంబర్ వెరిఫికేషన్ అని వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చాలా మంది వినియోగదారులు TRAI పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ కు బలైపోతున్నారని చెప్పారు. వాటి పట్ల యూజర్లను అలర్ట్ చేయాలని కమిటీ ఆదేశించింది.