దూసుకుపోతున్న BSNL నెట్ వర్క్..కొత్తగా 55లక్షల మంది యూజర్లు

BSNL ప్రభుత్వ రంగం టెలికం ఆపరేటర్..ఇప్పుడు ఈరంగంలో దూసుకుపోతోంది. ఇటీవల కస్టమర్ లో గణనీయమైన పెరుగుదల ను చూసింది.జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కంపెనీ మొబైల్ నంబర్ పోర్టింగ్ ద్వారా 55లక్షల కొత్త వినియోగదారులను పొందింది. ప్రయివేట్ టెలికం ఆపరేటర్లు అయిన ఐడియా, ఎయిర్ టెల్, జియో లు తమ రీచార్జ్ రేట్లు పెంచడంతో వినియోగదారులు సరసమైన ప్లాన్లు, నమ్మకమైన సేవల కోసం BSNL నెట్ వర్క్ను మెరుగుపర్చడంతో సబ్ స్క్రిప్షన్ తీసుకునేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు. 

ఇప్పటివరకు కేవలం 63,709 పోర్ట్-ఇన్‌లను మాత్రమే నమోదు చేసిన BSNL జూన్ 2024 నుండి ట్రెండ్ మార్చింది. జూలై నాటికి మొబైల్ నంబర్ పోర్టింగ్ సంఖ్య 1.5 మిలియన్లకు పెరిగింది.ఆగస్టులో 2.1 మిలియన్లకు చేరుకుంది. తరువాతి నెలల్లో సంఖ్యలు తగ్గినప్పటికీ- సెప్టెంబర్‌లో 1.1 మిలియన్లు , అక్టోబర్‌లో 0.7 మిలియన్లు పొందింది. 

ALSO READ | టీ ఫైబర్ ఇంటర్ నెట్‎ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

మరోవైపు BSNL కస్టమర్ పోర్ట్ అవుట్లు కూడా తగ్గాయి. తన కస్టమర్లను నిలుపుకునేందుకు BSNL చేస్తున్న ప్రయత్నాలు కూడా  మంచి ఫలితాలు ఇస్తున్నాయి. BSNL నుంచి పోర్ట్ అవుట్ అయ్యే కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. జూన్ లో 0.4 మిలియన్ల నుంచి జూలైలో 0.31 మిలియన్లకు పడిపోయింది. ఆగస్టులో 0.26 మిలియన్లకు చేరుకుంది. అక్టోబర్ లో 0.51 మిలియన్లకు స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం ట్రెండ్ మెరుగైన కస్టమర్ సంతృప్తిని సూచిస్తుంది. 

మొబైల్ గ్రోత్ మధ్య బ్రాడ్‌బ్యాండ్ సవాళ్లు

BSNL మొబైల్ సేవలలో పురోగతి సాధిస్తుండగా బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అడ్డంకులను ఎదుర్కొంటుంది. TelecomTalk నివేదిక ప్రకారం..BSNL Wi-Fi సబ్‌స్క్రైబర్ బేస్ FY 2020లో 10,92,650 నుంచి మార్చి 31, 2024 నాటికి 4,06,600కి పడిపోయింది. అదేవిధంగా దాని వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ వాటా సెప్టెంబరు 2024లో 16.61శాతం ఉండగా.. జియో కంటే 40.61శాతం ఎయిర్‌టెల్ 25.24శాతం గణనీయంగా తక్కువగా ఉంది.