దూకుడు పెంచిన BSNL.. కస్టమర్ల కోసం మరో అదిరిపోయే మొబైల్ రీచార్జ్ ప్లాన్

దూకుడు పెంచిన BSNL.. కస్టమర్ల కోసం మరో అదిరిపోయే మొబైల్ రీచార్జ్ ప్లాన్

ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన టారీఫ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు టారీఫ్ పాన్ల రేట్లు పెంచడాన్ని ఆసరాగా చేసుకున్న బీఎస్ఎన్ఎల్.. సరసమైన ధరలకే కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తూ కస్టమర్లను ఆకర్శిస్తోంది. తక్కువ రేట్లకే టారీఫ్ ప్లాన్లు అందుబాటులోకి తెసుకువస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. 

మిగిలిన కంపెనీలతో పోలిస్తే.. సరసమైన ధరలకే రీచార్జ్ ప్లాన్స్ లభిస్తుండటంతో వినియోగదారులు సైతం  బీఎస్ఎన్ఎల్ వైపు పెద్ద ఎత్తున మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే కస్టమర్లను మరింత ఆకర్శించేందుకు బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్‎ను ఇంట్రడ్యూస్ చేసింది. 180 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జ్ ప్లాన్‎ను తీసుకువచ్చిన బీఎస్‎ఎన్ఎల్.. దీని ధరను రూ. 897గా ఫిక్స్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాలింగ్‎తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

ఇక డేటా పరంగా చూస్తే ఈ ప్లాన్  కింద 90 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అందిస్తోంది. ఈ 90 జీబీ డేటాకు రోజువారీ లిమిట్ లేదు. 90 జీబీ డేటా పూర్తి అయ్యే వరకు అపరిమితంగా వాడుకోవచ్చని బీఎస్ఎన్ తెలిపింది. 90 జీబీని వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‎కు తగ్గుతుంది. అయితే ఈ రీచార్జ్ ప్లాన్ డేటా ఉపయోగించేవారికన్నా.. ఎక్కువ వ్యాలిడిటీ అవసరం అయిన వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

బీఎస్ఎన్ఎల్ 180 రోజుల ప్లాన్, 90 జీబీ డేటా, ధర రూ.897

  • అపరిమిత కాలింగ్
  • రోజుకు 100 ఎస్ఎంఎస్ 
  • 90 జీబీ డేటా (రోజువారీ లిమిట్ లేదు)
  • ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు