ఇండియాలో జనవరి 26న జరగబోయే 71 వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL తన చందాదారులకు భారీ ఆఫర్ ను అందిస్తోంది. BSNL రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు 71 రోజుల పాటు పెంచింది. ఈ ప్లాన్ చెల్లుబాటు కాలం 436 రోజులు అవుతుంది.
BSNL అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రిపబ్లిక్ డే కనుకగా కంపెనీ రూ.1,999 ప్లాన్ చెల్లుబాటును మరొక 71 రోజుల పాటు పొడిగించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ 436 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. దీంతో వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి.
ఈ ఆఫర్ 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది. గత నెలలో BSNL రూ.1,999 ప్లాన్ 60 రోజుల అదనపు వాలిడిటీని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిమిత కాల ఆఫర్ లలో భాగంగా అదే ప్లాన్ 71 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తున్నది. టెల్కో తన ARPU ని పెంచడంతో పాటు రూ .1,999 ప్లాన్‌తో కొత్త వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. BSNL నుండి వస్తున్న ఈ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న, క్రొత్త కస్టమర్లకు అందుబాటులో ఉంది. కొత్త BSNL చందాదారులు తమ మొదటి రీఛార్జ్ ఎంపికగా రూ.1,999 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.