
మీరు ఎక్కువ ఖర్చుతో రీచార్జ్ చేసి విసిగిపోయారా..తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం ఎదురు చూస్తున్నారా..అయితే BSNL మీకో గుడ్ న్యూస్ అందిస్తుంది. ప్రభుత్వం టెలికం ఆపరేటర్ BSNL బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ అందిస్తోంది.టెలికం మార్కెట్లో అత్యంత సరసరమైన ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే రీచార్జ్ ప్లాన్ ఇది.6నెలల వ్యాలిడిటీతో రూ.750 ల రీచార్జ్ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది.
BSNL తన GP2 యూజర్లకోసం ఈ ప్లాన్ ను ప్రారంభించింది. పాత రీచార్జ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఏడు రోజుల్లో రీచార్జ్ చేసుకోని యూజర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. కస్టమర్లు తరుచుగా రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు ఎక్కువ కాలం రీచార్జ్ చేసుకోకపోయిన డీయాక్టివేట్ సమస్యా ఉండదు.
- BSNL రూ. 750ల కొత్త రీచార్జ్ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్, లోకల్ , ఎస్టీడీ నెట్ వర్క్ లకు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు.
- రోజుకు 100 SMS లు ఉచితం, అదనంగా ఖర్చు లేకుండా కస్టమర్లకు ఎక్కువ కాలం నెట్ వర్క్ కనెక్షన్ అందిస్తుంది.
- ఇంటర్నెట్ యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. రోజుకు 1GB డేటా చొప్పున180GB డేటాను హైస్పీడ్ తో అందిస్తుంది.డైలీ లిమిట్ అయిపోతే కూడా ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. అయితే 40kbps స్పీడ్ తో మాత్రమే డేటా అందుతుంది.
- BSNL తన కస్టమర్లు హోలీ పండుగఆఫర్ గా అందించింది. ఎక్కువ కాలం రీచార్జ్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. మీరు ఆరు నెలల పాటు ఎలాంటి అడ్డంకులేకుండా ఉండే రీచార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ. 750 BSNL ప్లాన్ బెస్ట్ వన్.