
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్ రేట్లను భారీగా పెంచేశాయి. దాదాపుగా 26 శాతం ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 04వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లకు షాక్ ఇస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ ఓ సూపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది. కొత్త రూ. 249 ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వివరాల ఇలా ఉన్నాయి.
- దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్.
- మొత్తం 90GB డేటా, రోజుకు 2GBకి సమానం.
- రోజుకు 100 ఉచిత SMSలు
వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్ ను తీసుకువచ్చి్ంది. ఒకసారి ఎయిర్‌టెల్ తో బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ ను చెక్ చేసి చూస్తే
ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్:
- 28 రోజులు చెల్లుబాటు అవుతుంది.
- రోజుకు 1GB డేటా.
BSNL యొక్క రూ 249 ప్లాన్:
- 45 రోజులు చెల్లుబాటు అవుతుంది.
- రోజుకు 2GB డేటా.
ఎయిర్‌టెల్ తో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ మరో 17 రోజులు అదనంగా వస్తుంది.
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచడంతో బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్‌ను ప్రవేశపెట్టి కస్టమర్ల పట్ల తమకున్న నిబద్దతను చాటుకుంటుంది. అంతేకాకుండా వేరే కస్టమర్లను తమ వైపు అట్రాక్ట్ చేస్తుంది.