BSNL News: ఒక్క రూపాయికే 1GB డేటా.. బీఎస్ఎన్ఎల్ సంచలన ప్లాన్, పూర్తి వివరాలు..

BSNL News: ఒక్క రూపాయికే 1GB డేటా.. బీఎస్ఎన్ఎల్ సంచలన ప్లాన్, పూర్తి వివరాలు..

BSNL 251 Plan: ప్రస్తుతం భారతీయ టెలికాం మార్కెట్లో చాపకింద నీరులా బీఎస్ఎన్ఎల్ తిరిగి విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ రానున్న కాలంలో తన 4జీ, 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి సిద్ధం అవుతోంది. ఒకపక్క ప్రైవేటు టెలికాం సంస్థలు తమ యూజర్లపై టారిఫ్స్ భారాన్ని పెంచుతుండగా.. మరోపక్క బీఎస్ఎన్ఎల్ మాత్రం రేట్ల పెంపుకు వెళ్లే ఉద్ధేశ్యం లేదని వెల్లడించటం గమనార్హం. 

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో మ్యా్చ్ లు చూసేందుకు ఇష్టపడుతుండగా వారికోసం స్పెషల్ డేటా ప్యాక్ ప్రకటించింది. దీని ప్రకారం ప్రీపెయిడ్ యూజర్ల కోసం రూ.251 స్పెషల్ టారిఫ్స్ ప్లాన్ విడుదల చేసింది. దీనికింద యూజర్లు రూ.251 రీఛార్జ్ చేస్తే 251 జీబీల డేటాను 60 రోజుల వ్యాలిడిటీతో పొందుతారని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. అంటే కేవలం ఒక్కో జీబీ ఇంటర్నెట్ ఒక్క రూపాయికే అందుబాటులో ఉంటుంది. పైగా రోజూ ఎలాంటి వినియోగ పరిమితి లేకుండా అపరిమితంగా డేటాను వాడుకోవచ్చని టెలికాం సంస్థ పేర్కొంది. అయితే దీనిని ఆస్వాధించటానికి ముందుగా కస్టమర్లు చెల్లుబాటు అయ్యే యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 

మార్కెట్లోని ఇతర ఆటగాళ్లైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడఫోన్ ఐడియాలు సైతం ఐపీఎల్ సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఆకర్షనీయమైన డేటా ప్యాక్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జియో రూ.వంద రీఛార్జ్ కింద జియో హాట్ స్టార్ 90 రోజుల సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. ఎయిర్ టెల్ కూడా ఇదే తరహా యాడాన్ డేటా ప్యాక్ ప్రకటించింది. ఇందులో రూ.100 రీఛార్జ్ కింద 5జీబీ డేటా 30 రోజుల వ్యాలిడిటీతో పాటు జియో హాట్ స్టార్ యాక్సెస్ లభిస్తోంది.

Also Read : టాటాల నుంచి రూ.15వేల కోట్ల ఐపీవో

ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవల టెస్టింగ్ ట్రయల్స్ దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, కలకత్తా, పాట్నా, లక్నో, జైపూర్, భోపాల్, ఛండీఘడ్ సహా అనేక రాష్ట్ర రాజధానుల్లో కొనసాగిస్తోంది. అయితే కంపెనీ ఈ ఏడాది జూన్ నాటికి తన 4జీ సేవలను దేశవ్యాప్తంగా రోలవుట్ చేయాలనే ప్రణాళితో ముందుకు సాగుతోంది. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా లక్ష మెుబైల్ టవర్స్ ఏర్పాటు చేపట్టింది. 4జీ సేవల పూర్తి స్థాయి లాంచ్ తర్వాతే 5జీ సేవలను నగరాల వారీగా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వ టెలికాం సంస్థ ఉందని సమాచారం.