BSNL 5G: లాభాల దిశగా బీఎస్ఎన్ఎల్.. జియోకు మిస్సింగ్ బిల్.. 5జీ ట్రయల్స్ స్టార్ట్

BSNL 5G: లాభాల దిశగా బీఎస్ఎన్ఎల్.. జియోకు మిస్సింగ్ బిల్.. 5జీ ట్రయల్స్ స్టార్ట్

BSNL News: గత ఏడాది నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ సేవల వైపు ఎక్కువగా టెలికాం యూజర్లు ఆకర్షితులు అవుతున్నారు. అనేక ప్రైవేటు టెలికాం సంస్థల కంటే తక్కువగా ఛార్జీలు ఉండటంతో ఘర్ వాపసీ అంటూ తమ మనసు మార్చుకుంటున్నారు. ప్రస్తుతం టాటాల సహకారంతో కంపెనీ తన 4జీ, 5జీ సేవలను లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంస్థ జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో కవరేజీని పెంచేందుకు కూడా ఇన్ ఫ్రా నిర్మాణానికి టెండర్ల ప్రక్రియలో పనులు పురమాయించింది.

ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవల టెస్టింగ్ ట్రయల్స్ దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, కలకత్తా, పాట్నా, లక్నో, జైపూర్, భోపాల్, ఛండీఘడ్ సహా అనేక రాష్ట్ర రాజధానుల్లో కొనసాగిస్తోంది. అయితే కంపెనీ ఈ ఏడాది జూన్ నాటికి తన 4జీ సేవలను దేశవ్యాప్తంగా రోలవుట్ చేయాలనే ప్రణాళితో ముందుకు సాగుతోంది. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా లక్ష మెుబైల్ టవర్స్ ఏర్పాటు చేపట్టింది. 4జీ సేవల పూర్తి స్థాయి లాంచ్ తర్వాతే 5జీ సేవలను నగరాల వారీగా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వ టెలికాం సంస్థ ఉందని సమాచారం.

Also Read : ఐఫోన్ లవర్స్‌కి టారిఫ్స్ షాక్

దశాబ్ధాల తర్వాత ప్రస్తుతం కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం ప్రజల నుంచి నిరంతరం పెరుగుతున్న ఆదరణకు అద్దం పడుతోంది. 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా గడచిన డిసెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే గడచిన 6 నెలలుగా 55 లక్షల మంది కొత్త యూజర్లను సముపార్జించిందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం రాజ్యసభలో ప్రకటించారు. సంస్థకు కొత్త ఊపిరి పోసి దానిని తిరిగి లాభాల బాట పట్టించటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే టెలికాం రెగ్యులేటరీ సంస్థ డాట్ బీఎస్ఎన్ఎల్ కి 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు చేపట్టింది. ఈ స్పెక్ట్రమ్ విలువ రూ.61వేల కోట్లని వెల్లడైంది. 

కాగ్ సంచలన నివేదిక..
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బీఎస్ఎన్ఎల్ తన బిల్లింగ్ విషయంలో చేసిన తప్పుల వల్ల ఎంత మేర నష్టపోయిందనే విషయాలను ఎత్తి చూపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు మే 2014 నుంచి మార్చి 2024 మధ్య కాలంలో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం షేర్ చేసుకున్న మౌలికసదుపాయాల్లో అదనంగా అందించిన టెక్నాలజీ సేవలకు వసూలు చేయాల్సిన ఛార్జీలు రూ.వెయ్యి 757 కోట్ల విషయంలో బిల్ వసూలు చేయకపోవటంతో నష్టపోయినట్లు పేర్కొంది. అలాగే టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లకుచేసిన చెల్లింపుల నుంచి లైసెన్స్ ఫీజు వాటాను తగ్గించకపోవడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.38.36 కోట్ల నష్టాన్ని చవిచూసిందని కాగ్ ఆడిట్ రిపోర్టు హైలైట్ చేశారు.