
రీజనబుల్ రీఛార్జ్ ప్లాన్స్ తో సామాన్యుడి నెట్వర్క్ గా ప్రసిద్ధి చెందిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో అదిరిపోయే అఫర్ తీసుకొచ్చింది.. 5G, 4G సిమ్ లను 90 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఆన్ లైన్ ద్వారా సిమ్ ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది సంస్థ. తమ కస్టమర్స్ కి మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు ఈ అఫర్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది బీఎస్ఎన్ఎల్.
ఎయిర్టెల్ కు పోటీగా హోమ్ డెలివరీ:
బ్లింకిట్ ద్వారా ఆన్ లైన్లో సిమ్ డెలివరీ చేస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కు పోటీగా సిమ్ హోమ్ డెలివరీ ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. ఇప్పటికే సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ తో జియో, ఎయిర్టెల్ కు గట్టి పోటీ ఇస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు హోమ్ డెలివరీ ప్లాన్ తో కస్టమర్లను మరింత ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
బీఎస్ఎన్ఎల్ 5G సిమ్ ఆన్ లైన్లో ఇలా బుక్ చేసుకోండి:
- బీఎస్ఎన్ఎల్ అఫీషియల్ పార్ట్నర్ వెబ్సైట్ https://prune.co.in కి లాగిన్ అవ్వండి
- బై సిమ్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
- బీఎస్ఎన్ఎల్ టెలికాం ఆపరేటర్ ని సెలెక్ట్ చేయండి
- ఫస్ట్ రీఛార్జ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి
- డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ ని పూర్తి చేయండి
- అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
బుకింగ్ పూర్తవగానే 90 నిమిషాల్లో సిమ్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది.