BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌.. రూ.100 లోపు

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌.. రూ.100 లోపు

టెలికామ్ రంగంలో పోటీ పెరగటంతో దాదాపు అన్ని సంస్థలు టారిఫ్ ప్లాన్ యొక్క ధరలను డిసెంబర్ 1 నుండి పెంచాలని చూస్తూవుంటే  BSNL మాత్రం తన వినియోగదారులకు రూ.100ల లోపు ధరలో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది.  అన్ని ప్రైవేట్ టెల్కోలు ప్రస్తుతం రూ.100 ల లోపు గల ప్రీపెయిడ్ ప్లాన్‌లను తమ పోర్టుపోలియో నుండి తొలగించాయి.

BSNL మాత్రం ప్రస్తుతం రూ .100 కింద మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి వాయిస్ కాలింగ్, డేటా తో పాటు  SMS ప్రయోజనాలతో ఒక నిర్దిష్ట కాలానికి అందించనుంది. BSNL రెండు ఫ్రీడమ్ చోటా ప్లాన్స్, రెండు ప్రీపెయిడ్ STV ప్లాన్ తో పాటు ఒక వాయిస్ కాలింగ్ ప్లాన్ ను రూ.100 లోపు అందిస్తోంది. ఇందులో అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో 250 నిమిషాల వాయిస్ కాలింగ్ క్యాప్ ఉంది.

ఫ్రీడమ్ చోటా ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర రూ.9 నుండి ప్రారంభమవుతుంది. ఇది 250 నిమిషాల వాయిస్ కాల్స్, 100 MB డేటా, 100 SMS ప్రయోజనాలను ఒక రోజుకు అందిస్తుంది. ఇందులో రెండవ ఫ్రీడమ్ చోటా ప్లాన్ రూ.29 ధర తో ఏడు రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలు, 1GB 3G/ 2G డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారు ముంబై,ఢిల్లీ సర్కిల్‌లలో రోమింగ్‌లో ఉన్నప్పుడు వాయిస్ కాలింగ్ ఆఫర్ వర్తించదు.