![గుడ్న్యూస్..బెస్ట్ BSNL లాంగ్టర్మ్ రీచార్జ్ ప్లాన్.. బీటీవీ ద్వారా 450ఛానెల్స్ ఫ్రీ](https://static.v6velugu.com/uploads/2025/02/bsnl-recharge-plans-bsnl-sim-users-can-now-watch-450-live-tv-channels-for-free-through_vClOLyg2pT.jpg)
ప్రభుత్వం టెలికం ఆపరేటర్ బీఎస్ ఎన్ ఎల్ తన కస్టమర్లకు బెస్ట్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది.ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా 300 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంతేకాదు.. బీఎస్ఎన్ఎల్, ఓటీటీ ప్లే కలిసి సంయుక్తంగా లాంచ్ చేసిన బీటీవీ ద్వారా 450 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా చూడొచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనికి డేటా కూడా అవసరం లేదు.
300 రోజుల పాటు వ్యాలిడిటీ సిమ్ను యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ.797 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ మంచి ఎంపిక. ఈ ప్లాన్ ద్వారాఅన్ని రకాల నెట్వర్క్లకు 60 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మొదటి 60 రోజులు..రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 120 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు 60 రోజుల పాటు రోజుకు 100 SMS లు చేసుకోవచ్చు.
అయితే డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ 60 రోజుల వరకే ఉన్నప్పటికీ సిమ్ పూర్తిగా 300 రోజులు యాక్టివ్గా ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి10లోగా ఈ ప్లాన్ను వినియోగించుకోవాలి.
దీంతోపాటు బీఎస్ ఎన్ ఎల్ సిమ్ ను వినియోగిస్తున్న కస్టమర్లకు ఇకపై 450 లైవ్ టీవీ ఛానళ్లను అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది.బీఎస్ ఎన్ ఎల్ లాంచ్ చేసిన బీటీవీ ప్లాట్ ఫాం ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్, ఓటీటీ ప్లే తో కలిసి ఈ డైరెక్ట్ టు మొబైల్ (D2M) సేవను ప్రారంభించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది.