మొదట్లో ఉచితం అంటూ అందరికీ ఇంటర్నెట్ వాడకం అలవాటు చేసి అంబానీ(జియో) కాలక్రమేణ తన అసలు రూపాన్ని బయట పెడుతున్నాడు. మూణ్నెళ్లకు ఓసారి ఒక్కో రీఛార్జ్ ప్లాన్‌పై 50 రూపాయల చొప్పున పెంచుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాడు. అంబానీకి తామేమీ తక్కువ కాదంటూ సునీల్ భారతి మిట్టల్(ఎయిర్ టెల్) సైతం పోటాపోటీగా ధరలు పెంచేస్తున్నాడు. ఈ పరిస్థితులలో అందరూ మొగ్గు చూపుతున్న ఏకైక నెట్‌వర్క్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. అదేనండోయ్.. బిఎస్ఎన్ఎల్.
ఎంతైనా ప్రభుత్వ సంస్థ కనుక రీఛార్జ్ ప్లాన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వచ్చిన సమస్యాల్లా నెట్‌వర్క్ గురుంచే. సిగ్నల్ సరిగ్గా ఉండడం లేదంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతుంటారు. ఇది వాస్తవమే అయినప్పటికీ, మున్ముందు ఆ సందేహాలు మీకు అక్కర్లేదు. BSNL.. 4Gపై దృష్టి పెట్టడమే కాకుండా 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 4G సేవ కోసం అన్ని టెలికాం సర్కిల్‌లలో అనేక కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. 5G నెట్‌వర్క్ పరీక్షలను ప్రారంభించింది. రాబోవు నాలుగైదు నెలల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. కావున నెట్‌వర్క్ గురుంచి చింతించకండి.
రూ. 997 రీఛార్జ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చెప్పుకోదగ్గ ప్లాన్‌లలో ఇదొకటి. రూ. 997 రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 160 రోజులకుగానూ ప్రతి రోజూ 2GB డేటా చొప్పున మొత్తం 320GB డేటా అందిస్తున్నారు. దీంతో పాటు 100 రోజువారీ SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. వినియోగదారులు ఏదైనా నెట్‌వర్క్‌లో ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ ఆస్వాదించవచ్చు. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ నుండి ప్రయోజనం పొందవచ్చు.
నిజానికి రూ. 997 ప్లాన్ అనేది ధర ఎక్కువ అనిపించినా.. 160 రోజుల వ్యాలిడిటీ కనుక సరసమైన ధరే. ఇతర నెట్‌వర్క్‌లలో 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లపైనే 700 నుండి 750 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. వాటితో, పోలిస్తే ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.