జూన్​ నుంచి బీఎస్​ఎన్​ఎల్​ 5జీ సేవలు

జూన్​ నుంచి బీఎస్​ఎన్​ఎల్​ 5జీ సేవలు
  • ప్రకటించిన మంత్రి సింధియా

న్యూఢిల్లీ:  బీఎస్​ఎన్​ఎల్​ఈ ఏడాది జూన్​లో 4జీ నుంచి 5జీకి మారుతుందని కేంద్రం ప్రకటించింది. అప్పటి వరకు సంస్థ లక్ష 4జీ టవర్ల సైట్​మార్క్​ను చేరుకుంటుందని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా  అన్నారు. ఇప్పటికే 89 వేల సైట్లను ఇన్​స్టాల్​చేశామని తెలిపారు. వీటిలో 72 వేల సైట్లు మొదలయ్యాయని, -జూన్ నాటికి అన్ని సైట్లు పనిచేసేలా చూస్తామని తెలిపారు. 5జీకి మారడానికి,  అదనపు హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌లు అవసరమని మంత్రి వివరించారు.  

చైనా, దక్షిణ కొరియా, ఫిన్​లాండ్​, స్వీడన్​ మాదిరే ఇండియా కూడా సొంతగా 4జీ టెక్నాలజీని డెవెలప్​చేసుకుందని పేర్కొన్నారు. సెజ్​ల మాదిరిగానే టెలికం మాన్యుఫాక్చరింగ్​ జోన్లనూ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటిలోని టెస్టింగ్​, సర్టిఫికేషన్​ సదుపాయాలు దేశీయంగా టెలికం పరికరాల ఉత్పత్తిని పెంచుతాయని సింధియా పేర్కొన్నారు.