బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో రూ.6 వేల కోట్లు!

బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో రూ.6 వేల కోట్లు!

న్యూఢిల్లీ: 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ కంపెనీ బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో రూ.6 వేల కోట్లు కేటాయించాలని  కేంద్రం భావిస్తోంది.    ముంబై, ఢిల్లీలో సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తున్న  మహానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పదేళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎంటీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4జీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విస్తరణలో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ సాయపడుతుంది. 

 బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయించడంపై కిందటి వారం జరిగిన కేబినెట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించారని, కానీ అధికారికంగా ప్రకటించలేదని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. ఈ టెలికం కంపెనీ  లక్ష 4జీ సైట్లను డెవలప్ చేయాలని చూస్తోంది. ఇందుకు సుమారు రూ.19 వేల కోట్ల అవసరమని అంచనా.  ఇప్పటివరకు రూ.13 వేల కోట్లను  కంపెనీ ఖర్చు చేసింది. 

మిగిలిన రూ.6 వేల కోట్ల కోసం  డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వద్ద కంపెనీ ప్రపోజల్ పెట్టిందని,  ఈ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డాట్ పంపిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసేందుకు 2019 నుంచి ఇప్పటివరకు మూడు ప్యాకేజీల కింద రూ.3.22 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది.