రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం ఆపరేటర్లు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. అన్ని రకాల రీచార్జ్ ప్లాన్ల ధరలను ఏకంగా 15 శాతం నుంచి 25 శాతంవరకు అమాంతం పెంచేశాయి. రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచడంతో కస్టమర్లపై అధిక భారం పడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో యూజర్లు బీఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. BSNL కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో ఎక్కువ బెనిఫిట్స్ అందించేందుకు కొత్త రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే BSNL రూ.108 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫ్లాన్..ఇతర టెలికం ఆపరేటర్ల ధరలతో పోలిస్తే తక్కువ, ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
BSNL రూ.108 రీచార్జ్ ప్లాన్
- దీని ధర రూ.108. వ్యాలిడిటీ 28 రోజులు
- అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1GB డేటాను 28 రోజులు పాటు అందిస్తుంది. అయితే ఇందులో రోజుకు ఉచిత 100 SMS లు లేవు.
జియో రూ. 249 రీచార్జ్ ప్లాన్
- దీని ధర రూ. 249 , వ్యాలిడిటీ 28 రోజులు
- 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్
- రోజుకు 1GB డేటాతోపాటుఉచితంగా 100 SMS లు
ఎయిర్ టెల్ రూ. 299 రీచార్జ్ ప్లాన్
- దీని ధర రూ. 299 , వ్యాలిడిటీ 28 రోజులు
- అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్,
- రోజుకు 1GB డేటా, 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీగా ఇస్తుంది.
వొడాఫోన్ ఐడియా రూ. 299 ప్లాన్
- దీని ధర రూ.299, వ్యాలిడిటీ 28 రోజులు
- రోజుకు 1GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
- 100 ఎస్ ఎంఎస్ లను ఆఫర్ చేస్తుంది.
వొడాఫోన్ ఐడియా, జియో, ఎయిర్ టెల్ లతో పోలిస్తే BSNL రూ. 108 రీచార్జ్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చు, ఎక్కువ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఇతర టెలికం ఆపరేటర్ల తో పోల్చినప్పుడు 28 రోజులపాటు 1GB డేటాను అన్ లిమిటెడ్ కాల్స్ ను కేవలం రూ. 108ల కే అందిస్తుంది. అయితే బీఎస్ ఎన్ ఎల్ ఇప్పుడు 2G/3G నెట్ వర్క్ తోనే పనిచేస్తుంది. కొన్ని సెలక్ట్ చేసిన నగరాల్లో మాత్రం 4G సేవలు అందిస్తుంది. మరో నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 4G సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది.