BSNL 3కొత్త రీఛార్జ్ ప్లాన్స్..లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ, డైలీ2GB డేటా,అన్ లిమిటెడ్ కాల్స్

BSNL 3కొత్త రీఛార్జ్ ప్లాన్స్..లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ, డైలీ2GB డేటా,అన్ లిమిటెడ్ కాల్స్

ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ BSNL కొత్త కొత్త రీచార్జ్ ఆఫర్లతో ప్రజాదరణ పొందుతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచడం, బీఎస్ ఎన్ ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బడ్జెట్ ఓరియెంటెడ్ రీచార్జ్ ప్లాన్లు, ప్రీమియం రీచార్జ్ ప్లాన్లను అందిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటోంది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లపై ఒత్తిడి పెంచుతూ వినూత్న ప్రణాళికలను రూపొందిస్తోంది. 

BSNL తన కస్టమర్ బేస్ కు తగిన వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. బడ్జెట్ పై దృష్టి పెట్టే, ప్రీమియం కస్టమర్లకు కూడా ఉపయోగపడుతుంది. అదనంగా దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోసం అనేక రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. తాజాగా మూడు లాంగ్ టర్మ్ రీచార్జ్ ప్లాన్లను ప్రారంభించింది.. వివరాలు చూద్దాం.  

BSNL 150 రోజుల ప్లాన్  

BSNL ప్రసిద్ధ ఆఫర్లలో ఒకటి 150-రోజుల ప్లాన్. దీని ధర రూ.397లు. ఈ ప్లాన్ ఐదు నెలల పాటు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీని అందిస్తుంది. మొదటి 30 రోజులు కస్టమర్లు ఉచిత కాలింగ్, 2GB రోజువారీ డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పొందుతారు.

BSNL 160 రోజుల ప్లాన్ 

మరో ఆకర్షణీయమైన BSNL రీచార్జ్ ప్లాన్..160-రోజుల ప్లాన్. దీని ధర రూ. 997. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 160-రోజుల వ్యాలిడిటీతో ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. ఇది ఉచిత కాలింగ్ ,డేటా రెండింటినీ కోరుకునే వారికి అనువైన ఎంపిక.

BSNL 180 రోజుల ప్లాన్

మరో BSNL ప్లాన్..180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌. రీచార్జ్ ప్లాన్ ధర రూ.897. అందిస్తుంది. మొత్త వ్యాలిడిటీలో అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. మొత్తం 90GB డేటా ,రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు. తగినంత టాక్ టైమ్ ,డేటాను పొడిగించిన కాలానికి కలుపుతారు.ఈ ఆకర్షణీయమైన ఆఫర్లతో BSNL ఖచ్చితంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా నిలుస్తోంది.