ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL జియో, ఎయిర్ టెల్ వంటి లీడింగ్ సంస్థలకు షాక్ మీద షాక్ ఇస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే 5.5 మిలియన్ల కస్టమర్లను కొల్లగొట్టిన BSNL,, టెలికం రంగాన్ని ఏలుతున్న జియో, ఎయిర్ టెల్ కు ధీటుగా ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మరో బంపర్ ఆఫర్ తో ఈ రెండు సంస్థల ఆదాయానికి భారీ గండీ కొట్టే ప్లాన్ రెడీ చేసింది. న్యూ ఇయర్ ప్లాన్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సబ్ స్క్రిప్షన్ అవకాశం కల్పించే అద్భుతమైన ప్లాన్ కస్టమర్ల ముందుకు తెస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తో రీచార్జ్ సేవలను జియో, ఎయిర్ టెల్ అందిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ కూడా అలాంటి అవకాశం ఇస్తే బాగుంటుందని కస్టమర్లు చాలా రోజులుగా ఆశిస్తున్నారు. ఇటీవలన ఆస్క్ బీఎస్ఎన్ఎల్ (AskBSNL) పేరుతో ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో కస్టమర్లతో ఎంగేజ్ అయ్యారు బీఎస్ఎన్ఎల్ సీఈవో. ఈ సందర్భంగా ఒక కస్టమర్.. నెట్ ఫ్లిక్స్ తో కూడిన రీచార్జ్ ప్లాన్ ఎప్పుడు తీసుకొస్తారు అని ప్రశ్నించాడు. త్వరలోనే ఆ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని, దీనిపై సంస్థ ఇప్పటికే చర్చలు జరుపుతోందని తెలిపారు.
ALSO READ | హోండా, నిస్సాన్ విలీనం.. చైనాను దెబ్బకొట్టేందుకు ఎత్తుగడ.. మూడో అతిపెద్ద ఆటోకంపెనీగా అవతారం
అత్యంత ప్రీమియం ఓటీటీ Netflix ను ప్రస్తుతం BSNL తప్ప అన్ని నెట్వర్క్ లు అందిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లేకుండా ఇప్పుడు ఏ ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ తక్కువ రీచార్జ్ తో అత్యధిక కంటెంట్ ఇస్తున్న ఓటీటీగా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ఓటీటీ సేవలను రీచార్జీ ద్వారా అందిస్తే ఇక BSNL కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.
అదేవిధంగా 2025 మార్చికి ఈ సిమ్ (eSIM) సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. జులై నెల నుంచి కేవలం నాలుగు నెలల్లోనే 5.5 మిలియన్ల కస్టమర్లను ఆకర్శించిన BSNL ఇప్పుడు ఓటీటీ సేవలతో మరింత మందిని గ్రాబ్ చేయనుందని కంపెనీ సీఈవో చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్ టెల్ ఇతర టెలికం స్పేస్ ను ఆక్యుపై చేసి డుయోపోలీగా మారాయి. ఈ క్రమంలో 15 శాతం వరకు రీచార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. అయితే ప్రవేటు సంస్థలు ఇష్టారీతిన పెంచిన రేట్లపై ఆగ్రహానికి గురైన కస్టమర్లు ప్రభుత్వ రంగ సేవలకు పోర్ట అయ్యారు. జియో, ఎయిర్ టెల్ మార్కెట్ షేర్ ను బీఎస్ఎన్ఎల్ మెల్ల మెల్లగా లాగేసుకుంటూ.. మళ్లీ పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.