దేశవ్యాప్తంగా పట్టణాలతోపాటు మారుమూల గ్రామాల్లో కూడా బ్రాండ్ బాండ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.ఎయిర్ టెల్, జియో వంటి పెద్ద పెద్ద ప్రైవేట్ టెలికం సంస్థలు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ బ్రాండ్ బాండ్ సంస్థ BSNL భారత్ ఫైబర్ పేరుతో సర్వీస్ ను అందిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా బ్రాడ్ బాండ్ ప్లాన్లను అందిస్తోంది. బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ వినియోగించే వారితో చాలా సందేహాలున్నాయి. జియో, ఎయిర్ టెల్, బీఎస్ ఎన్ ఎల్ వంటి బ్రాండ్ బాండ్లలో ఏదీ బెటర్ అని చాలామందిలో డౌట్లు ఉన్నాయి.
మీరు కొత్త బ్రాండ్ బాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నట్టయితే.. రూ.500 లోపు ఏ టెలికం సంస్థ సౌకర్యవంతమైన ఇంటర్నెట్ ను అందిస్తోంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్, బీఎస్ ఎస్ ఎల్ భారత్ ఫైబర్ లను పోల్చి చూద్దాం.. డబ్బును ఆదా చేసేందుకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది.
BSNL భారత్ ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్
BSNL భారత్ ఫైబర్ ధర రూ. 399 లు.
నెల రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 30Mbps స్పీడ్ తో 1400 GB వరకు అందిస్తుంది. దీనిలో ప్రత్యేక ఆఫర్ ఏంటంటే.. 30 రోజుల వరకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి.
జియో ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్
జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.399. ఇది కూడా నెల రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది 30Mbps స్పీడ్ తో 3300GB వరకు అందిస్తుంది. దీంతోపాటు అన్ లిమిటెండ్ కాల్స్ అందిస్తుంది.
ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ ధర రూ. 499. ఇది కూడా నెలరోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీనిలో మాత్రం 40Mbps స్పీడ్ ఇంటర్నట్ లభిస్తుంది.
వీటిలో ఏదీ బెటర్?
రూ. 500 లో జియో, ఎయిర్ టెల్, బీఎస్ ఎన్ ఎల్ ప్రీపెయిడ్ ఫైబర్ బ్రాండ్ బాండ్లను పోల్చినప్పుడు జియో, BSNL రెండూ రూ. 399 లకే ప్లాన్ అందిస్తున్నాయి. అయి తే ఒకే ధరంతో జియో ఫైబర్ మనీ పరంగా బెస్ట్ ఆఫర్ 3300 GB ని అందిస్తోంది. మరోవైపు జియో, ఎయిర్ టెల్ ను పోల్చినప్పుడు ఎయిర్ టెల్ 40Mbps స్పీడ్ ఇచ్చిన్నప్పటికీ 100రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది.