- విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులతో బీఎస్పీ, బీజేపీ నాయకుల ధర్నా
కాగజ్ నగర్, వెలుగు : రోజుకు అనేక సార్లు కరెంటు ట్రిప్ అయ్యి గంటల తరబడి రావడం లేదని, రాత్రీపగలు తేడా లేకుండా కరెంటు కోతలు పెడుతున్నారని బీఎస్పీ, బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇదేనా బీఆర్ఎస్ సర్కార్ చెబుతున్న 24 గంటల నిరంతర సరఫరా అని ప్రశ్నించారు.
Also Read : రవితేజ అడిగారు.. ఫ్యాన్స్ చెప్పారు.. ఆ విషయంలో ఫ్యాన్స్దే ఫైనల్ డెసిషన్
విద్యుత్ కోతలను నిరసిస్తూ వినియోగదారులు, రైతుల తో కలిసి సోమవారం కౌటాల మండలం గుండాయి పేట్ సబ్ వద్ద నిరసన తెలిపారు.
ఎండలు మండుతున్నా కరెంటు ఉండడం లేదని.. కోతలతో మిర్చి, వరి పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. సమస్యపై సబ్ స్టేషన్ కు ఫోన్ చేసినా స్పందించడంలేదని గుండాయిపేట్, వీర్థంది, తాటిపల్లి, మొగడ్ ధగడ్, బాలేపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్నిరంతరం సరఫరా చేయాలని డిమాండ్చేశారు. నిరసనలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వాను పటేల్, సర్పంచ్ జిజా బాయి, నాయకులు పాల్గొన్నారు.