మునుగోడులో నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ

మునుగోడు, నల్గొండ జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీఎస్పీ బరిలోకి దిగింది. బీఎస్పీ అభ్యర్థి గా అందోజు శంకరా చారి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నేతలతో కలసి చండూర్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు మునుగోడులో బీఎస్పీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాదా సీదాగా.. ముఖ్య నేతలు, వెంట వచ్చిన కార్యకర్తలతో కలసి అందర్నీ పలుకరిస్తూ.. సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం చండూర్ చేరుకుని అభ్యర్థి శంకరాచారితో నామినేషన్ వేయించారు.