సూర్యాపేట, వెలుగు: బీఆర్ఎస్ లీడర్లు బెదిరింపులకు భయపడేది లేదని, వారి అరాచకాలకు చరమగీతం పాడాలని బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట టౌన్, అనంతారం, ఏపూర్, సోలిపేట, రాజ నాయక్ తండా, లక్ష్మి తండ గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన 1500 మంది బీఎస్పీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై యువత , మహిళలు ముందుండి పోరాటం చేయాలని కోరారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మద్యం, మనీతో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. పేటలో బీఎస్పీ జెండా ఎగరేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.