ఉచితాల పేరుతో మోసం చేస్తున్న బీఆర్ఎస్ : వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు :  ఉచిత పథకాల పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజలను మోసం చేస్తోందని బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ఆరోపించారు.  మంగళవారం ఆత్మకూర్ ఎస్ మండలానికి చెందిన నేతలు బొల్లె సైదులు, బారి అశోక్, కోలా కరుణాకర్  ఆధ్వర్యంలో  200 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలు  బీఎస్పీ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకంగా కావాల్సిన అవసరం ఉందన్నారు. బహుజనులను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్న మంత్రి జగదీశ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో లునావత్ నగేశ్, సైదులు, సంతోష్, మహేశ్, వెంకటేశ్, నరసింహ, జాటోత్ రాకేశ్, శ్రీను, బానోత్ హుస్సేన్ తిగావత్ శ్రీను తిరుప, గణేశ్,  శ్రీకాంత్, మధు సాగర్, సతీశ్,  రమేశ్, శ్రీరాములు, సైదా, అశోక్ పాల్గొన్నారు.