ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి: మాయావతి

ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి: మాయావతి

తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించాలని సీఎం స్టాలిన్ కోరారు. పెరంబూర్ స్కూల్ గ్రౌండ్ లో ఆర్మ్ స్ట్రాంగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.

ఆర్మ్ స్ట్రాంగ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ ను  జూలై 5  రాత్రి ఆరుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాతకక్షలతోనే హత్య జరిగినట్లు గ్రేటర్ చైన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ తెలిపారు. ఇప్పటికే 8మంది నిందితులు లొంగిపోయారన్నారు.