మంత్రి కేటీఆర్పై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

  • పేదోళ్లను యాక్టర్లను చేస్తా
  • బీఎస్పీ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మునుగోడు, వెలుగు: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలను దత్తత తీసుకుంటామని అంటేనే జనాలు భయపడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా మునుగోడు మండలంలోని గూడపూర్, కోరటికల్, చీకటిమామిడితో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మంత్రి కేటీఆర్​మునుగోడును దత్తత తీసుకుని సిరిసిల్లలా అభివృద్ధి చేస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సిరిసిల్ల లాంటి అభివృద్ధి అక్కర్లేదని, అక్కడ ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరెళ్ల జనాలకు జరిగింది మరిచిపోలేన్నారు.

మునుగోడులో దోపిడి దొంగల పార్టీలు ఆధిపత్య వర్గాలకు టికెట్లిస్తే బీఎస్పీ మాత్రమే బీసీలకు టికెట్ ఇచ్చిందన్నారు. రాచకొండ గుట్టల్లో బహుజన ఫిల్మ్ సిటీ పెట్టి పేదలను యాక్టర్లు చేస్తామన్నారు. మహిళా నాయకురాలు నిర్మల, నాయకులు గోవర్ధన్, యాదయ్య, భీం ప్రసాద్​  పాల్గొన్నారు.