బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యం : గైని గంగాధర్​

బోధన్, వెలుగు : తెలంగాణలో బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు బీఎస్పీ జిల్లా ఇన్​చార్జి గైని గంగాధర్​పేర్కొన్నారు. మంగళవారం బోధన్​లో బీఎస్పీ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్, అనిల్​ టాకీస్ చౌరస్తా, అంబేద్కర్​చౌరస్తా, రైల్వేగేట్​మీదుగా బీఎస్పీ ఆఫీస్​ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా గంగాధర్​మాట్లాడుతూ బహుజనులకు బంగారు భవిష్యత్ అందించేలనే ఉన్నత లక్ష్యంతో ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ బీఎస్పీలో చేరారని, ఆయన్ను ప్రేరణగా తీసుకొని అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. 

కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి  బీఎస్పీలో చేరిన పలువురిని కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి సింగాడే పాండు, జిల్లా నాయకులు రామ్​చందర్, నీరడి శంకర్, బర్ల రాములు, రామకృష్ణ, సుభాష్​, గోపాల్ పాల్గొన్నారు.