తెలంగాణలో రాక్షస పాలన.. కామేశ్​

పాల్వంచ,వెలుగు:  బలిదానాలతో వచ్చిన  రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్​ మండిపడ్డారు. జెండా పండుగలో భాగంగా ఆదివారం మండలంలోని మొండికట్ట, కారెగట్టు, రాజాపు రం, యానంబైలు, సత్యనారాయణపురం గ్రామాల్లో  బీఎస్పీ జెండాలను ఆయన ఎగురవేశారు. అనంతరం  కామేశ్​ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాల నలో అభివృద్ధి నిధులు అధికా ర పార్టీ నాయకుల జేబులోకి వెళుతున్నాయని విమర్శించారు.  

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపి కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీని గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి రాజేశ్వరి,తోట వెంకన్న, ముంతాజ్, కాకటి శైలజ,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు  చండ్ర నరసింహారావు.